Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరో ఏడాది మాత్రమే గవర్నర్ గా ఉంటా: కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు

మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్ గా ఉంటానని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. తనకున్న విస్తృతమైన అనుభవాన్ని అధికారులు ఉపయోగించుకోవాలని అన్నారు. రాజ్ భవన్ లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, కిరణ్ బేడీని బదిలీ చేయాలంటూ అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విధులను అడ్డుకుంటూ, పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ కిరణ్ బేడీపై కాంగ్రెస్, డీఎంకే నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News